నాటు సారా రవాణా చేస్తే కఠిన చర్యలు

Navatelangana,Adilabad,Telugu News,Telangana,నవతెలంగాణ-రెబ్బెన
నాటు సార రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్‌ ఎక్సైజ్‌ సీఐ దీపక్‌ హెచ్చరించారు. జిల్లా ఎక్సైజ్‌ అధికారి జ్యోతి కిరణ్‌ సమాచారంతో రెబ్బెన మండలంలోని ఖైరిగూడ గ్రామం వద్ద నాటుసారా చేస్తున్నారన్న సమాచారం మేరకు గస్తీ నిర్వహించి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటు సారా సరఫరా చేయడం తయారు చేయడం నేరమన్నారు. ఇద్దరు వ్యక్తులు రాంకుమార్‌, సీతారాంలను పట్టుకొని వారి నుండి 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ రమేష్‌, సిబ్బంది లక్ష్మణ్‌, సురేష్‌, ధను పాల్గొన్నారు.