ప్రయివేటు విద్యాసంస్థల దోపిడీపై కఠిన నిబంధనలు అమలు చేయాలి

– రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యులు చిలకమర్రి నర్సింహ
– ఉచిత విద్యా, వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ-శంషాబాద్‌
ప్రయివేటు విద్యాసంస్థల దోపిడీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కఠిన చర్యలు తీసుకో వాలని తెలంగాణ రాష్ట్రఎస్సీ ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యులు చిలకమర్రి నర్సింహ అన్నారు. శనివారం ఆయన శంషాబాద్‌లో మీడియాతో మాట్లా డుతూ..విద్యా, వైద్యం విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎవరెన్ని చెప్పినా ఎన్ని ప్రభుత్వాలు మారినా భారతదేశం నేటికీ పేద దేశం గానే ఉందన్నారు. దారిద్ర రేఖకు దిగువగా ఉన్న పేదలకు అందుతున్న రేషన్‌ బియ్యం ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తుందని తెలిపారు. దేశ ప్రజలు పేదరికంలో మగడానికి మగ్గాడానికి ప్రధాన కారణం విద్యా వైద్యం ప్రయివేటుపరం చేయడమే నని విద్య ద్వారానే పేదరికం నుంచి బయటపడ తామని ఆలోచించిన తల్లిదండ్రులు వారి బంధువు లు పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని సా మాన్య జనం నుంచి ధనవంతుల దాకా ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల నుంచి ఉన్నత ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ఆలోచించడం సహజమేన న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 సంవత్సరా లుగా పేదరిక నిర్మూలన కోసం అనేక చట్టాలు చేసినప్పటికీ ప్రధానమైన మనిషి ఆర్థిక మూలాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపే విద్యా, వైద్యం విషయంలో నిర్లక్ష్యం చేశాయని తెలిపారు . ప్రభు త్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించే కార్యక్ర మంలో ప్రభుత్వాలు వెనుకబడ్డాయన్నారు. విద్యా, వైద్యాన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోకుండా ప్రయివేటు శక్తులకు అవకాశం కల్పించడంతో దేశ సేవ, శాస్త్రీయ విద్య అనే భావన నుంచి ప్రభుత్వా లు తప్పుకున్నాయన్నారు. ఇదే అదునుగా ప్రయివే టు విద్యాసంస్థలు పుట్టగొడుగుల పుట్టుకొచ్చి జలగల్లాగా దోపిడీకి పాల్పడుతున్నాయని ఆందో ళన వ్యక్తం చేశారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయు లు ప్రభుత్వ విద్యాసంస్థల్లో బోధన చేస్తున్నప్పటికీ కనీస శిక్షణ లేని విద్యను బోధించే ప్రయివేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. టీటీసీ, బీఈడీ, ఎంఈడీ శిక్ష ణ పొంది ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చే స్తూ తమ పిల్లలను మాత్రం ప్రయివేటు పాఠశాల లకు పంపించడం ఏమిటో వారే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటే అందమైన విద్య అందించే అవకాశం ఉంటుంది కదా మరి వారికి ప్రయివేటు వ్యామోహం ఎందుకని ప్రశ్నిం చారు. సామాజిక హౌదా (సోషల్‌ స్టేటస్‌) కోసం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పరితపించ డం తీవ్రమైన నేరమన్నారు. తను బోధించే విద్య పైనే తనకు నమ్మకం లేకుంటే ప్రభుత్వ పాఠశా లలు ఏ విధంగా బలోపేతం అవుతాయో ఉపా ధ్యాయులు ఆ సంఘాల నేతలు చెప్పాలని అన్నా రు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఉపాధ్యాయుల కొరత సిబ్బంది కొరత కోసం ఉపాధ్యాయులు ఉద్యమించడం వాటిని సాధిం చుకో వడం సమాజాన్ని ఆ విధంగా చైతన్యం చేయడం జరగాలి కానీ తమ పిల్లలను ప్రయివేటు బాట పట్టించడం సరైంది కాదన్నారు. తాము ఎం త కష్టపడి బోధన చేస్తున్నామన్నది కాదు బోధన ఏ విధంగా ఉంది అనేది కాదు తమ పిల్లలు ఎక్కడ చదువుతున్నారనేది ప్రధాన అంశమన్నారు. ఏ ఉపాధ్యాయుడిని కదిలించిన తమ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అడిగితే పలానా కార్పొరేట్‌ లేదా పలానా ప్రైవేటు స్కూలు అని చెప్తారు మరి నువ్వు ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు విద్యా బోధన చేస్తున్నావు నీకా నమ్మకం ఎందుకు లేదు అని అడిగితే సమాధానం లేకుండా పోతున్నదని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ప్రయి వేట్‌కు వెళ్తుంటే సాధారణ జనం ఏం ఆలోచిస్తార ని ప్రశ్నించారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశా లల్లో చదివించడం లేదని భావనతో ప్రభుత్వ పాఠశాలలపై ఉపాధ్యాయులకు చులకన భావం ఏర్పడిందన్నారు. వారి ప్రవర్తన సాధారణ జనంపై కూడా ఉందన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించడానికి సాధారణ మధ్య తరగతి ప్రజలు ఆసక్తి చూపడం లేదన్నారు. నా యకుల నుంచి ఎంపీ ఎమ్మెల్యేల వరకు తమ పిల్లలను వాళ్ల స్టేటస్‌ తగ్గట్టు ప్రైవేటు కార్పొరేటు పాఠశాలల్లో చదివిస్తున్నారని ఏసీ గదుల్లో కూర్చు న పెట్టి నర్సరీ పిల్లలకు లక్షల రూపాయలు తగిలే స్తున్నారన్నారు. దీనంతటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అన్నారు. ఇదే అదునుగా విద్యా వ్యాపారానికి ప్రయివేట్‌ విద్యా సంస్థలు సామాన్యజనాన్ని జలగల్లాగా పిక్కు తిం టున్నాయని తెలిపారు. ప్రయివేట్‌ మోజు విష యంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆలోచన దృక్పథంలో మార్పు రావాలన్నారు. ఈ విషయం లో విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అన్నారు. విద్య అమ్ముకోవడం కొనుక్కోవడం ఒక సామాజిక రుగ్మతగా మారడం దేశానికి మంచిది కాదన్నారు. మంచి నాణ్యమైన సేవాగుణం కలిగిన వ్యక్తులను తయారు చేయ డం ప్రయివేట్‌ యాజమాన్యాలతో కాదన్నారు. ప్ర స్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైనదశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో జరుగు తు న్న దోపిడీపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయివేట్‌ విద్యాసంస్థలపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి రంగంలోకి దిగాలని డిమాం డ్‌ చేశారు. విద్యా, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడానికి సాధ్యమయ్యే అన్ని రకాల చర్యలు చేపట్టాలని అన్నారు.