
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
వ్యాపారస్తులు, కిరాణా దుకాణం యజమానులు తమ షాపుల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని హుస్నాబాద్ ఎస్ ఐ తోట మహేష్ తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలో కిరాణా షాప్ యజమానులకు సీసీ కెమెరాల ఏర్పాటుపై వివరించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ కిరాణా దుకాణాల ఎదుట 2019 చట్టం ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు సరైన భద్రత చర్యలు పాటించని యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఏదైనా నేరం జరిగితే నేరస్తులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ప్రత్యక్ష సాక్షులుగా ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా ఇంటి యజమానులు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే భద్రతపరంగా బాగుంటుందని సూచించారు.