15 నుంచి సమ్మె

– తెలంగాణ యూనైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌(సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న రెండో ఏఎన్‌ఎంలు, ఈసీ ఏఎన్‌ఎంలు, ఆర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌ ఏఎన్‌ఎంలు, వైద్య విధాన పరిషత్‌ ఏఎన్‌ఎంలు, హెచ్‌ఆర్డీ ఏఎన్‌ఎంలు, ఇతర అన్ని రకాల ఏఎన్‌ఎంలను యధావిధిగా రెగ్యులర్‌ చేయాలని తెలంగాణ యూనైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌(సీఐటీయూ) డిమాండ్‌ చేసింది. ఇదే అంశంపై ఈనెల 15 నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యకప్రధాన కార్యదర్శులు ఎండీ. ఫసియోద్దీన్‌, కె.యాదనాయక్‌ తెలిపారు. సమ్మె జయప్రదానికి ఆదివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ నగర కార్యాలయంలో రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పీహెచ్‌సీ/యూపీహెచ్‌సీల నుంచి కాంట్రాక్టు ఏఎన్‌ఎం నాయకులు తప్పకుండా హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.