పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె

– గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు ఆర్‌ మహిపాల్‌
నవతెలంగాణ-నవాబుపేట్‌
పంచాయతీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని గ్రామపంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు ఆర్‌ మ హిపాల్‌ అన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎం ప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ రాష్ట్ర కమి టీ పిలుపులో భాగంగా నవాబ్‌పేట్‌ పంచాయతీ కార్మి కుల సమ్మె నేటి నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తా మన్నారు. మండలంలో ఉన్న ఎంపీడీవో సూపరింటెండెంట్‌ అజరు కుమార్‌కు వినతి పత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్య క్షులు ఆర్‌ మహిపాల్‌ మాట్లాడుతూ గ్రామ పంచాయ తీలలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు పెరుగు తున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు, మల్టీ పర్పస్‌ విధానం రద్దు చేయాలని పెండింగ్‌ వేతనా లు ఇవ్వాలన్నారు. ప్రమాద బీమా రూ.10 లక్షలు ఇవ్వాలని, వేధింపులు ఆపాలని అక్రమ తొలగింపు లు ఆపాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జి ల్లా అధ్యక్షులు శ్రీను నాయక్‌, గ్రామపంచాయతీ ఎం ప్లాయిస్‌ యూనియన్‌ నవపేట్‌ మండల నాయకులు కుమార్‌, శివ కుమార్‌, లింగయ్య, నాగేష్‌, వెంకటేశం, శివరాజ్‌, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌, గాలయ్య, వెంకటయ్య, నర్సింలు, రాజు, తదితరులు పాల్గొన్నారు.