జీతాలు ఇచ్చేవరకు సమ్మె..

నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : జీతాలు ఇచ్చేవరకు సమ్మె కొనసాగిస్తామని మెడికల్ కళాశాల శానిటేషన్ వర్కర్లు, హోంగార్డులు స్పష్టం చేశారు. పెండింగ్ వేతనాలు ఇప్పించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం మెడికల్ కాలేషాల ఎదుట సానిటేషన్ సిబ్బంది సెక్యూరిటీ గార్డ్ లు చేస్తున్న సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు శానిటేషన్ సిబ్బంది మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ నెలలో కూడా వేతనాలు సక్రమంగా చెల్లించలేదని ఈఎస్ఐ, పిఎఫ్, కట్టలేదని ఆరోపించారు. ఇతర జిల్లాలలో మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు సక్రమంగా అందిస్తున్నారని అలాంటప్పుడు నల్లగొండ మెడికల్ కళాశాలలోనే ఎందుకు సమస్య తలెత్తుతుందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
డీఎస్పీ మద్దతూ…
జీతాలు సక్రమంగా ఇప్పించాలని కోరుతూ సమ్మె చేస్తున్న మెడికల్ కళాశాల సిబ్బందికి ధర్మ సమాజ పార్టీ మదర్ తెరిపింది.  ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు శంకర్, జగన్ లు మాట్లాడుతూ సిబ్బంది అతి తక్కువ వేతనాలను కూడా సక్రమంగా అందివ్వకుంటే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. 14 రోజులుగా సమ్మె చేస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణం వారి సమస్యలను పరిష్కారం చేయాలని లేని పక్షంలో శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందితో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి నాయకులు సైదులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.