ప్రభుత్వం దిగి వచ్చే వరకూ సమ్మె

– మధ్యాహ్నం భోజన జిల్లా కార్యదర్శి యెలామోని స్వప్న
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రభుత్వం దిగి వచ్చే వరకూ మధ్యాహ్నం భోజన కార్మికులు సమ్మె కొనసాగిస్తారని జిల్లా కార్యదర్శి యెలా మోని స్వప్న అన్నారు. వీరి సమ్మె శనివారం మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమకు ఆరు నెలలుగా బిల్లులు రాక ఇబ్బందులు పడు తున్నామన్నారు. వేతనాలు అందడం లేదన్నారు. అప్పులు చేసి పాఠశాలల్లో వంటలు చేసి పెడుతున్నారని చెప్పారు. రూ.మూడు వేల జీతాన్ని ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీకే దిక్కులేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలని డి మాండ్‌ చేశారు. కోడుగుడ్డుకు ప్రభుత్వం రూ.5 ఇస్తుం టే మారెట్‌లో రూ.6కు ఒక గుడ్డు చొప్పున దొరుకు తుందన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ మే గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ప్ర మాద బీమా రూ.5లక్షల ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాం డ్‌ చేశారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ మున్సిపల్‌ కన్వీనర్‌ చింతపట్ల ఎల్లేశ, మండల కన్వీనర్‌ బుగ్గ రాములు, ఆదిభట్ల మున్సిపల్‌ నాయకులు నర్సింహా, మధ్యాహ్న భోజన కార్మికులు జయమ్మ, నశ్రీన్‌, సువర్ణ, పద్మ, హంసమ్మ, రాధా, కళావతి పాల్గొన్నారు.