‘సమస్యలు పరిష్కరించి, జీవో ఇచ్చే వరకూ సమ్మె’

నవతెలంగాణ-వికారాబాద్‌ రూరల్‌
సమస్యలు పరిష్కరించి జీవో ఇచ్చేవరకూ సమ్మె ఉదృతం చేస్తామనిఅంగన్‌వాడీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్సమ్మ, భారతి లక్ష్మి అన్నారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో 20 రోజులుగా సమ్మె కొనసాగు తోంది. శనివారం సమ్మె సందర్భంగా జిల్లా కలెక్టర్‌, డీ డ బ్ల్యూ పోలీస్‌ లు పిలిపించి జిల్లా నాయకత్వంతో చర్చలు జరిపారు. సమ్మె విరమించాలని సమస్యలు పరిష్కరి స్తామన్నారు. కానీ సమస్యలు పరిష్కరించి జీవో ఇచ్చేవరకు సమ్మె ఉధతం చేస్తామని అధికారులకు అంగన్‌వాడీ ఉద్యో గుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్సమ్మ భారతి లక్ష్మి అన్నారు. ప్రభుత్వం హామీ జీవో ఇవ్వనిచో సమ్మె ఉధతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. కార్య క్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు మహిపాల్‌ రామ కృష్ణ చంద్రయ్యలు జిల్లా నాయకురాలు అంగన్‌వాడీ టీచ ర్లు, హెల్పర్లు మినీ అంగన్‌వాడీలు పాల్గొన్నారు.