మెరుగైన ఫలితాల కోసం కృషి చేయండి 

Strive for better results– కౌన్సిలర్ చందు లాల్

నవతెలంగాణ – భైంసా
ఉపాధ్యాయులు మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని బైంసా పట్టణ నాలుగవ వార్డ్ కౌన్సిలర్ చందూలాల్ సూచించారు. ఏపీ నగర్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో నూతనంగా విధుల్లోకి చేరిన ఉపాధ్యాయులను సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వసతులను సద్వినియోగపరచి మెరుగైన ఫలితాలకు ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. శాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడెల్లు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, శంకర్,, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తాలూకా అధ్యక్షులు మోహన్, మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు చోండి రాజేశ్వర్, ప్రాథమిక ఉన్నత ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.