పటిష్టంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి…

-ప్రభుత్వ భవనాలపై నాయకుల చిత్రాల తొలగిపు 

నవతెలంగాణ-బెజ్జంకి : మండలంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అధికారులు పటిష్టంగా అమలు చేస్తున్నారు.బుధవారం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై గతంలో ఏర్పాటుచేసిన రాజకీయ నాయకుల చిత్రాలను రంగులతో గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించారు.రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని సంబధిత మండల అధికారులు సూచించారు.