– హెచ్‌డీిఎఫ్‌సీ బ్యాంక్ వెల్లడి
ముంబయి : ప్రయివేటు రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గృహ రుణాల జారీలో మెరుగైన వృద్థిని కనబర్చుతున్నట్లు తెలిపింది. హెచ్‌డిఎఫ్‌సి విలీనం తర్వాత మరింత పటిష్ట పెరుగుదల చోటు చేసుకుందని పేర్కొంది. 2023 డిసెంబర్‌తో ముగిసిన చివరి రెండు త్రైమాసికాల్లో రెండంకెల వృద్థి నమోదు చేసినట్లు పేర్కొంది. రెండు సంస్థల విలీనం తర్వాత గృహ రుణాల మార్కెట్‌లో 18 శాతం నుంచి 20 శాతం వాటాకు పెరిగినట్లు తెలిపింది. 2050 నాటికి దేశంలో 90 కోట్ల నివాసాల అవసరం ఉండొచ్చని అంచనా వేసింది. గృహ రుణాలకు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది.