
అడవుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సీ.సీ.ఎఫ్ భీమా నాయక్ స్థానిక అధికారులను ఆదేశించారు.కొత్త పోడు జరగకుండా నిఘా ఉంచాలని చెప్పారు.మండలంలో బుధవారం పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. ముందుగా వేదాంత పురం బీట్ పరిధిలో వెదురు కోతపై జరిగిన శిక్షణా కార్యక్రమాన్ని సందర్శించారు. వెదురు సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అనంతరం ఊట్లపల్లి పరిధిలో 50 హెక్టార్ల అభివృద్ది ప్రతిపాదన ఏరియా ను పరిశీలించారు. ప్లాంటేషన్ చేయనున్న వివరాలపై ఆరా తీశారు. అశ్వారావుపేట బీట్ పరిధిలో ప్లాంటేషన్ కు సిద్ధం చేసిన 2 ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అదే ప్రాంతంలో సోలార్ బోరు నిర్మాణ పనులను తనిఖీ చేశారు.విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉందొద్దని ఉద్యోగులకు సూచించారు.అడవుల రక్షణలో నిత్యం పర్యవేక్షణ ఉండాలని చెప్పారు.ఆయన వెంట డీ.ఎఫ్.ఓ కిష్ట గౌడ్, పాల్వంచ ఎఫ్.డీ.ఓ దామోదర్ రెడ్డి,రేంజర్ మురళీ సిబ్బంది ఉన్నారు.