– ఎస్పీ రితిరాజ్
నవ తెలంగాణ – జోగులాంబ గద్వాల
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా లోక్‌సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రితిరాజ్ తెలిపారు. శాంతియుత వాతవా రణంలో ఎన్నికలు నిర్వహిం చడానికి 1200 మంది జిల్లా, రాష్ట్ర, కేంద్ర పోలీస్ బలగా లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా…
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సోమవారం ( మే 13న ) జరిగబోయే పార్లమెంట్ ఎన్నికలకు చేపట్టిన భద్రతా చర్యలను వివరించారు. జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. తద్వారా జిల్లాలోని ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగిం చుకోవా లన్నారు. జిల్లాలో 1200 మంది జిల్లా, రాష్ట్ర ( టీఎస్‌ఎన్‌పీీ శిక్ష్షణ కానిస్టేబుళ్లు) కేంద్ర (3 కంపినీల ఐటీబీపీ బలగాలు) పోలీస్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు, 65 రూట్ మొబైల్స్, 25 క్విక్ రియాక్షన్ టీమ్స్ ( క్యూఆర్టీ) స్ట్రయికింగ్ ఫోర్స్/ స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్/ అబ్జర్వేషన్ టీమ్స్‌లతో పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
జిల్లాలో పోలింగ్ కేంద్రాలు..
జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషన్‌లు 594, సాధారణ పోలింగ్ స్టేషన్లు 435 , క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 159.
స్వాధీన పరుచుకున్న వివరాలు..
ఇప్పటివరకు స్వాధీనపరచుకున్న నగదు రూ. 1,56,76,860లు, లిక్కర్ 5344.095 లీటర్లు, అంచనా విలువ దాదాపు రూ.37,08,066లు ఇతర సామాగ్రి అంచన విలువ దాదాపు రూ. 7500లు, సీజ్ చేసినా నగదు,లిక్కర్,ఇతర వస్తువుల విలువ మొత్తం విలువ రూ.1,93, 92,426లు, జిల్లాలో ఇప్పటివరకు 390 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. గతంలో ఎలక్ట్రోరల్ నేరాలకు పాల్పడ్డ వ్యక్తులతో పాటు అందులో సహకరించిన వ్యక్తులను బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. రౌడీ షీట్ కలిగిన వారిని కూడా ముందస్తుగా బైండోవర్ చేసినట్లు తెలిపారు. 32 ఎన్‌బీ డబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనాలపై కఠినంగా ఉన్నామన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు జిలాల్లో ఎన్నికల నియామావళి ఉల్లం ఘన కేసులు 04 నమోదైనట్లు వివరించారు.
లైసెన్స్‌డ్ ఆయుధాల డిపాజిట్…
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియామవళి అనుసారంగా లైసెన్స్ కలిగిన ఆయుధాలు అన్నియు డిపాజిట్ కొరకు అండర్ సెక్షన్ 144 సీఆర్‌పీసీ అనుసరించి నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లాలోని మొత్తం 53 ఆయుధములు డిపాజిట్ కాబడినవి. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లోఎలాంటి భయం, వత్తిడి లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.