
మనకోసం జరిగే పోరాటం లో మనమే పాల్గొనకపోతే మన బానిసత్వానికి మనమే కారణం.పాత పెన్షన్ సాధన కై ఆగష్టు 12 న చలో హైదరాబాద్ సన్నాహక కార్యక్రమంలు టీఎస్ సిపిఎస్ ఈ యు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎన్. నరేందర్ రావు ఆధ్వర్యంలో గురువారం భీమభవన్, సంక్షేమ భవన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మరియు పుస్తక ముద్రణాలయం లలో రాష్ట్ర సహ అధ్యక్షులు కోటకొండ పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముసలి తనం లో ఉసురు తీసే పెట్టుబడి దారి పెన్షన్ విధానం ని రద్దు చేయాలని ఉద్దేశం తో గత జులై నెల 16 నుండి 31 వరకు పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నామన్నారు.రాష్ట్ర అధ్యక్షులు స్టితప్రజ్ఞ ఆధ్వర్యంలో 33 జిల్లాల గుండా సాగిన యాత్ర ని ఉద్యోగ ఉపాధ్యాయులు జయప్రదం చేశారని చెప్పారు.ముగింపు సభని నాంపల్లి లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఆగష్టు 12 ననిర్వహిస్తున్నామన్నారు.ఉద్యోగ ఊపాధ్యాయులందరు తమ కుటుంబాలతో సహ వచ్చి మన బలాన్ని ప్రదర్శించి మన శక్తి ప్రభుత్వానికి తెలియజేయాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ కోటకొండ పవన్, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ. సత్యనారాయణ, సహ అధ్యక్షులు మహేందర్ ఉపాధ్యక్షులు, అశోక్ రెడ్డి, శ్యాం సుందర్, శ్రీనివాస్ రావు, ఈశ్వరయ్య, టీఎన్జీవో నాయకులు సురేందర్ రెడ్డి, ఆర్గనైసింగ్ సెక్రటరీ – శ్రీనివాస్ రావు, శంకర్, దర్మేందర్, సందీప్, ఈసీ మెంబెర్స్, అంజిరెడ్డి, రెడ్డప్ప, మల్లేష్, ప్రవీణ్, భాస్కర్, శతదితరులు పాల్గొన్నారు.