ఊహించని శక్తులతో పోరాటం

Struggle with unexpected forcesవిరాజ్‌ రెడ్డి చీలం హీరోగా అను ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొం దుతున్న యాక్షన్‌, లవ్‌ ఎంటర్‌ టైనర్‌ ‘గార్డ్‌’. జగా పెద్ది దర్శక త్వంలో అనసూయ రెడ్డి నిర్మిస్తు న్నారు. ‘రివేంజ్‌ ఫర్‌ లవ్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. మిమి లియోనార్డో, శిల్పా బాలకష్ణన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మెల్‌బోర్న్‌లో నివసించే పాతికేళ్ల కుర్రాడైన సుశాంత్‌ సెక్యూరిటీ గార్డ్‌గా వర్క్‌ చేస్తుంటాడు. తను కష్టపడి సొంతంగా ఓ సెక్యూ రిటీ ఏజెన్సీని స్టార్ట్‌ చేయాలని అనుకుంటాడు. ఆ క్రమంలో సామ్‌ అనే సైకాలజిస్ట్‌తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో ప్రేమలో కూడా పడతాడు సుశాంత్‌. అనుకోని పరిస్థితుల్లో అతని జీవితం ఓ మలుపు తీసుకుంటుంది. తన జీవితంలో ప్రేమ కోసం సుశాంత్‌ ఊహించని శక్తులతో ఎలాంటి పోరాటం చేశాడనే కథాంశంతో రూపొందిన చిత్రమే ‘గార్డ్‌’. ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ను గురువారం మేకర్స్‌ విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లీష్‌, చైనీస్‌ భాషల్లోనూ రిలీజ్‌ చేయబోతున్నారు.