వర్గీకరణ సాధనే లక్ష్యంగా పోరాటాలు ఉధృతం

ఎంఎస్‌పి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు బిర్రు మహేందర్‌
నవతెలంగాణ-పర్వతగిరి
ఎస్సీ వర్గీకరణ సాధించడమే లక్ష్యంగా చేసుకుని పోరాటాలు ఉధతం చేస్తామని ఎంఎస్‌పి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు బిర్రు మహేందర్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.జూన్‌ 4న హన్మకొండ లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా మహా సభను విజయవంతం చేయాలని కరపత్ర ఆవిష్కరణ జూన్‌ 4న ఉమ్మడి వరంగల్‌ జిల్లా మహా సభను విజయవంతం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.వరంగల్‌ జిలా పర్వతగిరి మండల కేంద్రములో బుధవారం మండల కో ఇంచార్జి జిల్లా ధర్మయ్య మాదిగ ఆధ్వర్యములో మాదిగ ఉపకులాల ఆకాంక్ష ఎస్సీల వర్గీకరణ సాధించుకోవడమే అంతిమా లక్ష్యం అని వరంగల్‌ ఉమ్మడి జిల్లా మహా సభ కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంఎస్పీ వరంగల్‌ జిల్లా ఇంచార్జి బిర్రు మహేందర్‌ మాదిగ హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలను ఒత్తిడి పెట్టి చివర గట్టమైన ఎస్సీ ల వర్గీకరణ బిల్లు ను పార్లమెంట్‌ లో ఆమోదింప చేసే విధంగా పోరటాన్ని ఉదతం చేయాలని జూన్‌ 4న హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ ఆడిటోరియం మైదానం మహా సభ కు ముఖ్య అతిధి మంద కష్ణ హాజరైతారన్నారు. వరంగల్‌ జిల్లా లోని మాదిగ ఉపకులాలు, ఎస్సీ ఎస్టీ, బిసి, మైనార్టీ, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు అతధికంగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎం ఎస్‌ పి జిల్లా నాయకులు గోలి సుధాకర్‌, జిల్లా అనిల్‌, బొట్ల వెంకన్న, బొట్ల రమేష్‌, లింగాల యాకయ్య, చిన్నపెల్లి దర్గయ్య, యెల్లయ్య, సింగారపు సారయ్య, సింగారపు భాస్కర్‌, గాడిపెల్లి చేరాలు, కొల్లూరి వీరయ్య, ముడిదం వీరయ్య, రంగు వెంకటేశ్వర్లు, వాల్య నాయక్‌ తదితరులు పాల్గొన్నారు