
మండల కేంద్రంతో పాటు దాచారం, గుగ్గీల్ల, గాగీల్లాపూర్, తోటపల్లి, వీరాపూర్, బేగంపేట, వడ్ లూరు ప్రాథమిక,ప్రభుత్వోన్నత పాఠశాలలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాడ శ్రీధర్ అధ్వర్యంలో సభ్యత్వ నమోదు గురువారం చేపట్టారు. ఉద్యోగులకు డీఏలను వెంటనే మంజూరు చేయాలని ఎస్టీయూ జిల్లా కార్యదర్శి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లా ఆర్థిక కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్, బెజ్జంకి మండల ప్రధాన కార్యదర్శి రామంచ రవీందర్, మండల ఉపాధ్యక్షులు సతీష్ కుమార్, చేర్యాల అధ్యక్షుడూ కంతుల రాములు, జిల్లా బాధ్యులు శ్రీనివాస్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.