జవహర్ నవోదయకు విద్యార్థి ఎంపిక

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండల కేంద్రంలోని విజ్ఞాన జ్యోతి ఉన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి పాలెపు  లోక్షిత్ కన్నా జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్  గుండోజి దేవేందర్ సోమవారం తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అడ్మిషన్ పొంది నిజాం సాగర్ లో సీటు సాధించినట్లు తెలిపారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో సీటు సాధించిన లోక్షిత్ కన్నా ను పాఠశాల యజమాన్య బృందం అభినందించి, శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. భవిష్యత్తులో బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థిని యాజమాన్య బృందం, ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుల సౌమ్య, 5వ తరగతి ఉపాధ్యాయురాలు సరిత, ఇతర ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.