మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నిజామాబాద్ లో స్టూడెంట్ కౌన్సిల్ బాడీ ఎలక్షన్స్ ప్రశాంతంగా మంగళవారం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలలో సుమారు 7 విభాగాలలో కెప్టెన్, వైస్ కెప్టెన్, జూనియర్ కెప్టెన్లను(21 నాయకులను) విద్యార్థులు కళాశాలలో వారి ఓటు హక్కును వినియోగించుకుని , సమర్థులైన నాయకులను ఎన్నుకున్నారు, ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ధాత్రిక వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకో వాలని, దీని ద్వారా విద్యార్థుల్లో ాయకత్వ లక్షణాలు అలవడుతాయని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. సరిత అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.