విద్యార్థి జేఏసీ నాయకుడు జెల్లా శంకర్ కుటుంబాన్ని ఆదుకోవాలి: బోయ లింగస్వామి

– ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతూ మృతి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు అమ్మ ఒడి ఆశ్రమం నిర్వాహకుడు జెల్లా శంకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ శుక్రవారం ప్రకటనలో కోరారు. సహచర ఉద్యమకారుడు తెలంగాణ కోసం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అనేక దిగ్బంధాలు చేసి తెలంగాణ వచ్చిన తర్వాత అమ్మఒడి అనాధ ఆశ్రమం పేరుతో యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఆశ్రమాన్ని నెలకొల్పి దిక్కుతోచని అభాగ్యుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు.ఎందరో అభాగ్యులకు ఆశ్రయం కల్పించి జెల్లా శంకర్ చనిపోవడం చాలా బాధాకరమని బోయ లింగస్వామి త్రీవ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తెలంగాణ అమరవీరుల కోటాలో జెల్లా శంకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.