నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భువనగిరి పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ప్రతిభావంతులకు వ్యాసరచన, చెస్, క్యారమ్స్ ఉపన్యాసం పాటల పోటీలు నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులకు యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు పాల్గొనాలని కోరారు విద్యతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని దానికి నేనే ఒక చక్కటి ఉదాహరణ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, డీన్, పి ఈ టి, హై స్కూల్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు పేరెంట్స్ పాల్గొన్నారు.