ట్రిపుల్ ఐటీ వీసీ అక్రమాలపై విద్యార్థి సంఘాల గురి

– విజిలెన్స్ ఎంక్వయిరీ కి డిమాండ్
నవతెలంగాణ-ముధోల్ :  బాసరట్రిపుల్ఐటీ ఇంచార్జివీసీవెంకటరమణ చేసిన అక్రమాలు, ఆగడాలపై  విద్యార్థి సంఘాలు పోరుబాట పట్టానున్నయి. బాసర ట్రిపుల్ ఐటీ లో  ఒకపక్క విద్యార్థులు నిత్యం సమస్యలు ఎదుర్కొంటుంటే,  అక్కడ పనిచేస్తున్న  ఇంచార్జి వీసీ వెంకటరమణ  అక్రమాలకు పాల్పడుతూ, ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని  విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీసీపై విజిలెన్స్ ఎంక్వయిరీ చెపట్టాలని విద్యార్థి సంఘాలుడిమాండ్ చేస్తున్నాయి. ట్రిపుల్ ఐటీ లో  వీసీ చేసిన అక్రమాలు , ఆగడాల పై పూర్తి ఆధారాలను    ముధోల్ నియోజకవర్గం కు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత సర్దార్ వినోద్ కుమార్  సేకరించారు.  త్వరలో ఇంచార్జి వీసి వెంకటరమణ చేసిన అక్రమాలు, ఆగడాలపై హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయా విద్యార్థి సంఘాలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. వీసీ పై విజిలెన్స్ ఎంక్వయిరీ తో పాటు ఏసిబీ కి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది . ట్రిపుల్ ఐటీ సమస్యల పై పోరాడటానికి విధ్యార్థి సంఘాలు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు.