– చెడు వ్యసనాలకు అలవాట్లు పడితే చిన్న వయసులోనే శిక్షలు తప్పవు…
– డ్రగ్స్ నిర్మూలనపై ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు…
– ముఖ్యఅతిథిగా హాజరైన చండూరు సిఐ వెంకటయ్య..
నవతెలంగాణ – మునుగోడు
మాదకద్రవ్యాలకు మత్తుపదార్థాలకు విద్యార్థులు యువకులు దూరంగా ఉండాలి అని చండూరు సీఐ వెంకటయ్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. శుక్రవారం మండల కేంద్రంలోని చండూర్ రోడ్ లో గల సత్య ఫంక్షన్లో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదకద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ నిర్మూలన పై నిర్వహించిన అవగాహన సదస్సుకు సిఐ వెంకటయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం , పోలీస్ యంత్రాంగం డ్రగ్స్ నిర్మూలన కోసం అహర్నిశలు కష్టపడడం జరుగుతుంది అని అన్నారు . పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే పోలీసుల లక్ష్యం అని అన్నారు. విద్యార్థులు యువకులు డ్రగ్స్, గంజాయి కి మాదకద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలలో ఈ మాదకద్రవ్యాలకు అలవాటు పడి యువత విద్యార్థులు దొంగతనాలకు దోపిడీలకు మహిళల పైన అగైత్యాలకు పాల్పడి ఎంతోమంది విద్యార్థులు యువకులు తమ జీవితాలను కోల్పోతున్నారని అన్నారు . ఈ వయసులో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే జీవితాంతం అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. విద్యార్థులు, యువకులు సరైన మార్గం ఎంచుకొని మీ కళ్ళ ముందల ఎవరైనా డ్రగ్స్ గాని ఇతర మాదకద్రవ్యాలకు అలవాటైన ఎవరైనా సప్లై చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి సమాచారం ఇచ్చి సమాజాన్ని మరియు తమ కుటుంబాలను డ్రగ్స్ నుండి మాదక ద్రవ్యాల దగ్గర నుండి దూరంగా ఉంచాలని కోరారు. గతంలో ఎక్కడో పట్టణ కేంద్రాలలో మాత్రమే డ్రగ్స్ దొరికేవి కానీ ఇప్పుడు ప్రతి మార్ముల ప్రాంతాలలో గ్రామాలలో విస్తరించిన పరిస్థితి ఉన్నది కావున యువకుల విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లకి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించే కిట్లుకూడ అందుబాటులోకి రావడం జరిగిందని తెలియజేశారు.డ్రగ్స్ నిర్మూలనపై ఎప్పటికప్పుడు ఇలాంటి సెమినార్లు ఎంతగానో ఉపయోగపడతాయని నల్లగొండ జిల్లా డ్రగ్స్ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు లేని జిల్లాగా చూడడమే ఎస్పీ , డిఎస్పీ ఏకైక లక్ష్యమని అందుకు విద్యార్థులు యువకులు మేధావులు విద్యావంతులు తమ వంతు సహాయ సహకారాలు అందించి పోలీస్ యంత్రాంగానికి సహకరించాలన్నారు. ఈ అవగాహన సదస్సు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కట్ట లింగస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎస్ఐ వేంకటేశ్వర్లు, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు మల్లం మహేష్ , ఖమ్మంపాటి శంకర్ , ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి హై స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపల్ సత్తిరెడ్డి , డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మిర్యల భరత్ , సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వంశీ, ఎస్ఎఫ్ఐ , డివైఎఫ్ఐ నాయకులు శివ, రాజు,ప్రేమ్ సాగర్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు