విద్యార్థులకు కుక్క, కోతి కాటులపై అవగాహన

నవతెలంగాణ-శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నం లోని ఆదర్శ పాఠశాలలో గురువారం పశు వైద్యాధికారి చేత విద్యార్థులకు కుక్క, కోతికాటులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి ఎం. లక్ష్మీనారాయణ హాజరయ్యారు. సమావేశంలో మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రతి పాఠశాల నుండి ఏకో క్లబ్ విద్యార్థులు ఐదుగురు చొప్పున  పాల్గొన్నారు.