తెలంగాణ ఏంటీ నార్కోటిక్ బ్యూరో ఆద్వర్యంలో బుధవారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్ధులకు మాదక ద్రవ్యాలు రవాణా నియంత్రణ,వినియోగ కారక అనర్ధాలు పై అవగాహన కల్పించారు. ఇందులో టీజీ నేబ్ ఖమ్మం డీఎస్పీ మధు మోహన్ రెడ్డి మాదక ద్రవ్యం వినియోగంతో కలిగే అనర్ధాలు,యువత పై మత్తు పదార్థాల ప్రభావం,గంజాయి సేవనం మాన్పించడం,ఎన్.డీ.పీ.ఎస్ (మాదక ద్రవ్యాల చట్టాలు) పై వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత్ కుమార్,టీజీ నేబ్ సీఐ విజయ్ రాం కుమార్ స్థానిక సీఐ కరుణాకర్,ఎస్.హెచ్.ఒ ఎస్ఐ యయాతి రాజు లు పాల్గొన్నారు.