పోలీస్ విధులపై విద్యార్థులకు అవగాహన 

Students are aware of police dutiesనవతెలంగాణ – పెద్దాకొడప్ గల్
మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం రోజున ఏఎస్ఐ రాములు ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోలీసుల విధుల గురించి అవగాహన కల్పించారు. వ్యాసరచన పోటీలు నిర్వహించి, పోలీసులు ఉపయోగించే ఆయుధాలను విద్యార్థులకు తెలియజేశారుఅలాగే నూతన చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సాయి శివ రమేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.