
వర్షాకాలం ప్రారంభం కావడంతో కొత్త నీరు వచ్చి చేరడం నీరు కలిషితం అయ్యే అవకాశం ఉన్నందున వేడి చేసి చల్లారిన నీటిని మాత్రమే సేవించాలని, ఆరోగ్య విస్తీర్ణం అధికారి చింతల శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం రెంజల్ మండలం దండిగుట్ట ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, చిన్నారులు భోజనంకు ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఆయన అన్నారు. వర్షాకాలంలో దోమల పేడత ఎక్కువగా ఉండటం వల్ల మలేరియా, టైయిపాడ్, చికెన్ గునియా, డెంగ్యూ, పచ్చకామెర్లు వచ్చే అవకాశం ఉందని, ఆరోగ్యం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తమ ఇళ్ల వద్ద నీటి గుంటలు ఉన్నట్లయితే వాటిని పూడ్చి వేస్తే దోమలు దరిచెరవన్నారు. ఇళ్లల్లో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డేగా తమ ఇంట్లో నీటి తొట్టిలను కొబ్బరి చిప్పలు పాత టైర్లలో నీటి నిల్వ ఉండకుండా చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త విజయ, అంగన్వాడీ కార్యకర్త కవిత, ప్రధానోపాధ్యాయులు మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.