
జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో బేటి బచావో, భేటీ పడావో బాలికలకు ఆడపిల్లల సంరక్షణ పై అవగాహన కల్పించడం జరిగింది. ఆడపిల్లల సంరక్షణ, బాల్య వివాహాలు, అక్రమ రవాణాపై విద్యార్థిని విద్యార్థులకు వ్యతిరేకంగా పోటీలను నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. చిన్నారులకు బాల్యవివాహాలు, ఆడపిల్లల సంరక్షణ రక్తహీనతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ట ఆంజనేయులు, ఐసిడిఎస్ సూపర్వైజర్ సౌజన్య, ఐసిపిఎస్ సిబ్బంది బాబురావు, డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ స్వప్న, పుష్ప, అంగన్వాడి కార్యకర్తలు సుజాత, రాజ్యలక్ష్మి, రజిత, పూజ, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.