
2024-25 విద్యా సంవత్సరానికి గిరిజన బాల బాలికలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశానికి గాను మొత్తం 10 సీట్లకు 27 దరఖాస్తులు బుధవారం నాడు కలెక్టరేటు కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే లాటరీ పద్దతి ద్వారా పది మంది బాల బాలికలను ఎంపిక చేశారు. అనంతరం యాదగిరిగుట్టలోని శ్రీ విద్యానికేతన్ హైస్కూల్ లో ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జీ జిల్లా గిరిజన అభివృద్ది అధికారి ఎంఎ కృష్ణన్ లు పాల్గొన్నారు.