విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

నవతెలంగాణ -రాయపోల్ : స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు ఒక్క రోజు ఉపాధ్యాయులుగా పాత్ర వహించి మిగతా విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగిందని వడ్డేపల్లి జిల్లా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం రాయపోల్ మండలం వడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం స్వపరి పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులుగా పాత్ర వహించి పాఠశాలలోని మిగతా విద్యార్థులకు పాటలు బోధించడం జరిగిందన్నారు. డిఈవో కే. కావ్య, డిప్యూటీ డిఇఓ ఎం. ప్రసన్న, ఎంఈఓ ఎస్. అక్షిత, మండల నోడల్ ఆఫీసర్ ఆర్. అనూష, ప్రధానోపాధ్యాయులు ఎస్. వర్షిత,పిడి ఈ.వేణు, పిఈటి సిహెచ్. మహేష్, మిగతా విద్యార్థులు సబ్జెక్టుల వారీగా వారి వారి పాత్ర నిర్వహించారు. దీనివల్ల నిజ జీవితంలో కూడా సమాజంలో ఏ విధంగా ఉండాలనే విషయంలో స్వీయ అనుభవం ద్వారా విద్యార్థులకు స్వయంగా తెలుస్తుందని తెలిపారు. విద్యార్థులు అందరూ వారి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అది నెరవేర్చుకునే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థులకు వారి పై చదువులకు తొలిమెట్టుగా భావించి కష్టపడి చదివి పాఠశాలకు మరియు వారి తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చే విధంగా అందరు ఉత్తీర్ణులు కావాలని పాఠశాల పేరు చిరస్థాయిగా నిలపాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్,పాఠశాల ఉపాధ్యాయులు రాజకుమార్, నరేందర్ రెడ్డి, యాదయ్య, నవీన్ కుమార్, శ్యాంసుందర్, మహేష్, మంజుల, ఉమారాణి, సిఆర్పి స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.