నవ తెలంగాణ-కంది
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకరరావు ఆదేశాల ప్రకారం బుధవారం మండలం లోని కాశీపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జె.హనుమంతరావు ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. చట్టాల గురించి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలికలు బాగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. న్యాయ సహాయం కోసం సంగారెడ్డిలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, కాశీపూర్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు.