నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వనదర్శిని కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు హాజరై, మాట్లాడారు. విద్యార్థులకు ఆంజనేయ అభయారణ్యంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం, అడవులు పెంచడం ద్వారా కలిగే లాభాలను అటవీ శాఖ అధికారులు వివరించారు. విద్యార్థులు కూడా మొక్కలను పెంచడం ద్వారా కలిగే లాభాలను చిన్నతనం నుండే నేర్చుకోవాలని భావితరాలకు శ్వాస వాయువును అందించేది అడవులు మాత్రమే అని తెలిపారు. కృషి ఉంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని విద్యార్థులు కూడా కృషి పట్టుదలతో ముందుకు పోయి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమం రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా పరిషత్ సి ఈ ఓ శోభా రాణి అడిషనల్ డి సి పి లక్ష్మీనారాయణ,ఏ సి పి లు రమేష్, రవికిరణ్ రెడ్డి,జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజరాణి , డి పి ఓ సునంద, జిల్లా అధికారులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.