విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సన్మానం..

Honor to students and teachers..నవతెలంగాణ – నవీపేట్
మండల స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన మండలంలోని నాలేశ్వర్ పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సత్కరించారు. మండల స్థాయి క్రీడా పోటీల్లో తొమ్మిది బహుమతులను గెలుచుకున్న సందర్భంగా వీడీసీ సభ్యులు మరియు గ్రామస్తులు విద్యార్థులను, ఉపాధ్యాయులను డప్పు భాజాలతో ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయుడు సంతోష్ ను శాలువలతో సన్మానించి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దీప్,  సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాన్లు మాజీ సర్పంచ్ ద్యాగ సరిన్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్, వీడీసీ సభ్యులు సురేష్ మోహన్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.