ఉపాధ్యాయుల కర్తవ్యంలో విద్యార్థులు..

– ఎంపీఎస్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం
నవతెలంగాణ – బెజ్జంకి 
ఉపాధ్యాయుల కర్తవ్యంలో విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.మండల కేంద్రంలోని ఎంపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్ అధ్వర్యంలో గురువారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా కర్తవ్యం నిర్వహించారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, ఉపాధ్యాయుడు నారోజు శంకరా చారి పాఠ్యాంశాలు బోధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయునిలు శ్రీవిద్య, మంజుల, సంతోష పాల్గొన్నారు.