ఓట్  అక్షర ఆకృతిలో విద్యార్థులు..

Students vote in alphabetic format.నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగుల దుస్తులతో  ఓట్ అక్షర ఆకృతిని ప్రదర్శించిన విద్యార్థులు  అకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిదని దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న,  ఉపాధ్యాయులు కిషన్, దేవన్న, మహికాంత్, శ్రీనివాస్, రంగాచారి, పద్మ, గోపాల్, శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.