నవతెలంగాణ – భిక్కనూర్
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని, మండల ఇన్చార్జి వైద్యాధికారి దివ్య తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవసరమున్న వారికి మందులను పంపిణీ చేశారు. అనంతరం వైద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థులు చేతులను పరిశుభ్రంగా కడుక్కొవాలని, నీరు ఎక్కువగా తాగాలని ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సతీష్, ఏఎన్ఎం శ్యామల, ఆశా కార్యకర్త రేణుక, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.