
నవతెలంగాణ – గోవిందరావుపేట
ఫారెస్ట్ ఫైర్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన అవసరం అని పసర రేంజ్ అటవీ క్షేత్ర అధికారి జే మాధవి శీతల్ అన్నారు. బుధవారం మండలంలోని లక్ష్మీపురం ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫారెస్ట్ ఫైర్ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రేంజర్ మాధవి శీతల్ మాట్లాడుతూ అడవులకు నిప్పు అంటించడం వల్ల జరిగే అనర్ధాలను నష్టాలను వివరించారు. ఈ విషయం కుటుంబంలోని తల్లిదండ్రులకు కూడా అడవులను కాల్చడం వల్ల జరిగే పరిణామాలను వివరించాలని సూచించారు. అడవులు సస్యశ్యామలంగా ఉండడం వల్ల జరిగే లాభాలను కూడా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించారు. అడవుల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పి గంగూ నాయక్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వి నర్సయ్య, ఎం వేణుగోపాల్, ఎస్ సుజాత బీట్ ఆఫీసర్లు టి.దీప్ లాల్, ఎస్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.