ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉన్న సురగొండయ్య గుట్టం ప్రాంతంలోనే రాక్షస గుహలను, సమాధులను గురువారం చెన్నై బైబిల్ కాలేజీ యజమాన్యం, విద్యార్థులు సందర్శించి పరిశీలించారు. అక్కడ ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రకు ఆనవాళ్లు.. దామెరవాయి రాక్షస గుహలు అని అన్నారు. ములుగు జిల్లాలో ఉన్న మరో అద్భుతం అని వీటిని పర్యట ఆకర్షణగా మార్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయాలన్నారు. వీటిని పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు కృషి చేస్తే బాగుంటుందన్నారు. రాక్షస గుహలు చరిత్రకు ఆనవాలుగా మిగిలాయన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రానికి 105 కిలోమీటర్ల దూరంలో దామెరావాయి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల అడవిలో సూరగొండయ్య గుట్టపై సుమారు 125 ఆదిమానవుల సమాధులు దర్శనమిస్తాయని తెలిపారు. సురగుండయ్య గుట్టకు కుడి, ఎడవైపు వాగులు ప్రవస్తుండడంతో ఈ అద్భుత ప్రవేశం పర్యాటకులను ఆకర్షిస్తూ ఆనందాన్ని అందిస్తుందని తెలిపారు. వారి వెంట దామెరవాయి నాయకులు బాగే నర్సింహులు, పాస్టర్ యాలం సతీష్, పాయం సమ్మయ్య చిట్టిబాబు ప్రకాష్, చెన్నై బైబిల్ కాలేజ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.