సైన్స్ ఫెర్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఘనపూర్ హై స్కూల్ విద్యార్థులు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘనపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైన్స్ ఫెర్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ తెలిపారు. పాఠశాలకు చెందిన నవనీత్, రాము  వీరిద్దరూ చేసిన ప్రయోగం ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఉందని అందుకే వీరు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు వివరించారు.వీరు ఎంపిక కావడానికి గైడ్ ధనలక్ష్మి (ఉపాధ్యాయురాలు) కృషి చాలా ఉందని వారన్నారు. పాఠశాల విద్యార్థులు ఇంకా మున్ముందు జాతీయ స్థాయికి ఎదగడానికి పాఠశాల అధ్యాపక బృందం ప్రత్యేకంగా కృషి చేస్తామని తెలిపారు.అనంతరం పలువు విద్యార్థులను అభినందించారు.