మునిగల వీడు పాఠశాల నుండి గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపిక

– మునగలవేడు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కడియం వెంకటయ్య
నవతెలంగాణ-  నెల్లికుదురు
మండలంలోని మనిగల వీడు ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గురుకుల విద్యాలయాలకు పరీక్షలు రాసి ప్రతిభ కనబరిచి గురుకుల పాఠశాలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య తెలిపాడు. సోమవారం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల గురుకుల విద్యాలయాలలో 2024 సంవత్సరం ప్రవేశ పరీక్షలో పరీక్షలు రాసి ప్రతిభ ఘనపరిచిన మునగలవేడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు  ప్రభుత్వ ప్రాథమిక  పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న దబ్బేట సహస్ర, షేక్ జావిద్  విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు సంపాదించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కడియం వెంకటయ్య, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నంత స్థాయికి ప్రతి ఒక్కరు ఎదగాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ఉన్నారు.