మండలంలోని మదన్ పల్లి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభను చాటిన విద్యార్థులను పాఠశాల సిబ్బంది మంగళవారం అభినందించారు. వివరాలు జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ జిల్లా స్థాయి యోగా పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మదన్ పల్లి విద్యార్థినీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. జూనియర్ బాలుర విభాగంలో ప్రథమ బహుమతి ( గోల్డ్ మెడల్ ) ఏ . విశాల్ 9 వ తరగతి విద్యార్థి సాధించగా, ద్వితీయ బహుమతి ( సిల్వర్ మెడల్ ) ఎం. తరుణ్ 10వ తరగతి విద్యార్థి సాధించాడు. అలాగే ఆర్టిస్టిక్ సోలో విభాగంలో ఎన్. శరణ్య 9వ తరగతి విద్యార్థి ప్రథమ బహుమతి సాధించగా, ఆర్టిస్టిక్ పేర్ విభాగంలో పి. సౌమ్య, మానుష 9వ తరగతి విద్యార్థినిలు ద్వితీయ బహుమతి సాధించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, వ్యాయామ ఉపాధ్యాయురాలు ఇందిర, ఉపాధ్యాయ బృందం ప్రసన్న లక్మి, విజయ లక్ష్మి, రాజకుమారి, ఆశారాణి, చక్రధర్, మునీరుద్దీన్, సురేష్, నాన్ టీచింగ్ స్టాఫ్ అజయ్, వెంకట్ రావు, విజయ లక్ష్మి తదితరులు విజేతలను అభినందించారు.