రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైన రెడ్డిపేట విద్యార్థులు

 
నవతెలంగాణ- రామారెడ్డి
సెప్టెంబర్ 1తేదీ నుండి- 3తేదీ వరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిర్వహించే ఏడవ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలకు మండలంలోని రెడ్డి పేట జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి,వ్యాయమ ఉపాధ్యాయులు సాయి మౌర్య తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు వారిని ప్రత్యేకంగా అభినందించారు. బాలికలు జి రక్షిత, డి సంజన, జి బిందు, ఎల్ వైష్ణవి, బాలురు సిహెచ్ శివ కార్తీక్, ఈ రోహిత్, ఎం రిత్విక్, ఎన్ భరత్, లో ఎంపికయ్యారు.