సత్తా చాటిన కర్లపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు

నవతెలంగాణ గోవిందరావుపేట : ట్రైబల్ గేమ్స్ మరియు స్పోర్ట్స్ లో కర్లపల్లి ఆశ్రమ ఆంగ్ల మాధ్యమ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఉమ్మడి వరంగల్ జిల్లా లోని ట్రైబల్ విద్యార్థిని, విద్యార్థులకు14,17 సంవత్సరాల విభాగంలో గేమ్స్,స్పోర్ట్స్ 8 జొనులుగా విభజించి మొదట మెడారంలో  నిర్వహించారు అక్కడ ప్రతిభను కనబర్చిన విద్యార్థులను ఈనెల 20.12.2023 నుండి 22.12.2023 వరకు జోన్ స్ధాయి క్రీడలు జంబోరి గ్రౌండ్ ఐ. టీ. డి. ఏ ఏటూరునాగారం లో నిర్వహించారు ఈ క్రీడల్లో సెలక్ట్ అయిన క్రీడాకారులు భద్రాచలంలో నిర్వహించే రాష్టస్థ్రాయి క్రీడలలో పాల్గొంటారు.
సెలక్ట్ అయిన విద్యార్థులు
,సురేష్ కబడ్డీ 17 సం శివమణి క్యారమ్స్ 14సం,
విజయ్ క్యారమ్స్ 14సం,శివసాయి వాలీబాల్ 17సం,
బిజ్జు ఖోఖో 14సం,జానీ ఆర్చరీ 17సం,అర్జున్ ఆర్చరీ 14సం,సిద్దార్థ వాలీబాల్ 14సం,శివ వాలీబాల్ 14సం
ప్రతిభ కనపర్చి క్యారమ్స్ లోప్రథమ స్థానంలో నిలువగావాలీబాల్ ద్వితీయ స్థానంలో నిలిచారు. సెలక్ట్ అయిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.కల్తి. శ్రీనివాస్,వ్యాయమ ఉపాధ్యాయులు శ్రీ.యాలం.ఆదినారాయణ  మరియు ఉపాధ్యాయులు అభినందించారు.