– తెలంగాణ టాపర్‌గా నిలిచిన అవని ఉపాసన
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
ఉన్నత శ్రేణి విద్యా ప్రమాణాలతో క్రమశిక్షణ కలిగిన విద్యాభోదనతో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం విద్యార్థు లను ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలోని శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్‌లో ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి సీబీఎస్‌ఈ పరీక్షలో మొత్తం 101 మంది విద్యార్థులు హాజరవ్వగా 100కి 100 శాతం విద్యా ర్థులు ఉత్త్తీర్ణత సాధించడంతో పాటు కే.అవని ఉపాసన అనే విద్యార్థి 500 మార్కులకు 491 మార్కులు సాధించి తెలంగాణ టాపర్‌గా నిలిచింది. అందులో ఏడుగురు విద్యా ర్థులు ఎం.సాయి సింధు 487, ఎం.హరిహరణ్, కే.రుషీ ల్‌లు 483మార్కులు, జే.ఆకాంక్ష,, పి.మనస్వినిలు 482 మార్కులు సాధించ గా కే.హనీష, టి. రుచితలు 481 మార్కులు సాధించారు. 11 మంది విద్యార్థులు 95 శాతం తో 12 మంది 90 శాతం మార్కులతో ఉత్త్తీర్ణత సాధించి సత్తా చాటారు. అందరి సహకారం ఈ విజయానికి కారణం అని పాఠశాలలో విద్యార్థులు అందరూ 75 శాతానికి పైన మా ర్కులు సాధించారని, 100 శాతం ఉత్తీర్ణులయ్యారని పాఠ శాల ప్రిన్సిపాల్ యు. వాణి తెలిపారు. ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచిస్తామని, పబ్లిక్ స్పీకింగ్ వంటి ప్రో గ్రామ్స్ పెట్టడంతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యం పెం పోందించే కార్యక్రమాలు చెప్పడతామన్నారు. 5 నుండి 7 ఏండ్లున్న పిల్లలకు ప్రంపంచంలోని దేశాల పేర్లు, వాటి క్యాపిటల్ సిటీల పేర్లు నేర్పించి 2019వ సంవత్సరంలో అవార్డు సాధించామని, 2022లో 10 ఏండ్లలోపు పిల్లలకు 100 టేబుల్స్ 100 నిషాల్లో చెప్పించి అవార్డు సాధించా మన్నారు. ఇంతటి ఘన విజయం సాధించడానికి విద్యా ర్థుల నిరంతర కృషి వారి తల్లిదండ్రుల సహకారం, ఉపా ధ్యాయుల సృజనాత్మక బోధన, పర్యవేక్షణ, వ్యక్తిగత శ్రద్ధ, శ్రీ చైతన్య పాఠశాలల యాజమాన్యం సూచనలు, సలహాలు, నడిపించే విధానం ముఖ్య కారణమని ఆమె పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
దేశం లోనే మొదటి ర్యాంకు సాధించడమే తమ లక్ష్యం…
ఏడాదికి 4 ఫ్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ పెట్టి విద్యార్థులను ప్రోత్సహిస్తామని, నాసా, స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్స్ పెడు తూ విద్యార్థులను ప్రోత్సహిస్తు రానున్న రోజుల్లో సీబీఎస్ ఈ సిలబస్‌లో దేశంలోనే మొదటి ర్యాంక్ సాధించడమే తమ ఏకైక లక్ష్యమన్నారు. సాధిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.