నవతెలంగాణ -పెదవూర: అచ్చం పేటలో నిర్వహించిన గిరిజన పెద్దవూర సంక్షేమ శాఖ వసతి గృహ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల జోనల్ లెవెల్ క్రీడాస్థాయి పోటీలలో పెద్దవూర గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు తమ సత్తాను నిరూపించుకూన్నారు. ఇట్టి క్రీడాంశాలలో లాంగ్ జంప్ 400 మీటర్స్ రిలే (అథ్లెటిక్స్ లో) సత్తా చాటి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. మునావత్ సాయి, మణికుమార్, పాతులోతు పవన్, హరీష్, వాలీబాల్ క్రీడలో రవీందర్, సుమన్, చిరంజీవి, సతీష్, అంజిబాబులను గోల్డ్ మెడల్స్ సాధించారు. క్రీడలలో గోల్డ్ మెడల్ నందుకు గాను వసతి గృహ ఆవరణలో, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలోజీ నాయక్, వసతి గృహ సంక్షేమ అధికారి కొల్లు బాలకృష్ణ, వసతి గృహ సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈ జోనల్ లెవెల్ క్రీడల్లో విద్యార్థులు మంచి ప్రతిభను చూపడానికి, వారికి సరైన దిశ నిర్దేశాన్ని చూపించిన ఆశ్రమ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రామయ్యను ప్రత్యేకంగా అభినందించారు.