విద్యార్థులు లేక వెలవెలబోతున్న డిగ్రీ కళాశాల..

Degree college where students are going to leave..– డిగ్రీ కాలేజి మంజూరు అయి రెండేళ్ళు అయినా.. చేరిన విద్యార్ధులు 12 మందే..
– 4 గ్రూపులకు 240 సీట్ల కేటాయింపు..
– సిబ్బందిని కేటాయించని ప్రభుత్వం..
– అడ్మిషన్లకు విద్యార్థుల అనాసక్తి..
– 10 మందికి నలుగురే హజరు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో గ్రామీణ విద్యార్ధుల సౌకర్యార్థం గత ప్రభుత్వం 2023 – 2024 విద్యాసంవత్సరంలో మంజూరు చేసిన డిగ్రీ కళాశాల వెలవెల పోతుంది. కనీసం సిబ్బందిని సైతం కేటాయించకుండా అలసత్వం వహించటం,ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే తాత్కాలికంగా తరగతులు నిర్వహించటంతో ఆదరణ కోల్పోతుంది.మౌళిక సదుపాయాలు లేని డిగ్రీ కళాశాలలో విద్యార్థులు అనాసక్తి చూపుతున్నారు. కనీసం తక్షణ అవసరాలకు నిధులు కూడా కేటాయించకపోవడం పేద విద్యార్ధులకు శాపంగా మారింది. 23 – 24 విద్యా సంవత్సరంలో కళాశాల మంజూరు అయింది.  నాలుగు గ్రూపులు కు 240 సీట్లు కేటాయించింది. డిగ్రీ కళాశాలను తాత్కాలికంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల లోనే ఏర్పాటు చేశారు.ఈ  ఏడాది అడ్మిషన్ లు పూర్తి అయ్యాక కళాశాల మంజూరు కావడంతో విద్యార్ధులు ఎవరూ చేరలేదు. 2024 -2025 విద్యా సంవత్సరానికి గాను 240 సీట్లకు గాను కేవలం 11 మంది మాత్రమే అడ్మిషన్ లు తీసుకున్నారు.వీరిలో ఒక విద్యార్థి పూర్తిగా మానేసింది. దీనితో 10 మంది మాత్రమే కళాశాలకు వస్తున్నారు. శుక్రవారం కళాశాలకు నలుగురు విద్యార్ధిని లు హజరయ్యారు. ఈ నలుగురు విద్యార్థులకు ఒప్పందం పద్దతిలో నియమించిన నలుగురు గెస్ట్ లెక్చరర్లు పాఠాలు బోధిస్తున్నారు. కళాశాల బాధ్యతలను సత్తుపల్లి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నండ్రు గోపి కి అప్పగించింది. మౌళిక వసతులు లేని కళాశాలలో నాణ్యమైన విద్య ఎలా అందుతుందనే అభిప్రాయంలో అడ్మిషన్ లు తీసుకోవడానికి ముందుకు రావటం లేదు ఇప్పటికైనా విద్యార్థులకు కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఇంచార్జి ప్రిన్సిపల్ గోపి మాట్లాడుతూ విద్యార్థులను మోటివేట్ చేస్తున్నామని.గత ఏడాది అసలు అడ్మిషన్లు లేవని అన్నారు. లెక్చరర్ లతో సమన్వయం చేసుకోవటం ద్వారా ఈ ఏడాది 11 మంది చేరారు తీసుకున్నట్లు తెలిపారు.వచ్చే ఏడాది అడ్మిషన్లు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.