నవతెలంగాణ – దుబ్బాక
పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు పొలంబాట పట్టారు. దుబ్బాకలోని ది మాస్టర్ మైండ్స్ స్కూల్ విద్యార్థులు శనివారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వరి పొలంలో నాట్లు వేసి అబ్బురపరిచారు.వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ శ్రీవిద్య,సైంటిస్ట్ ఉమారాణి సూచనలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బిట్ల యాదగిరి,వైవీ.రావు,ప్రిన్సిపల్ హరిబాబు,బయాలజీ టీచర్లు హరిబాబు,శ్రీవిద్య,దువ్వల శ్రీకాంత్ పాల్గొన్నారు.