విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత  సాధించాలి..

నవతెలంగాణ – చివ్వేంల
మండలంలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత  సాధించాలని  మండల విద్యాధికారి గోపాల్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. జడ్పిహెచ్ఎస్ చివ్వేంల మరియు జడ్పిహెచ్ఎస్ తిరుమలగిరి  లో పదవ తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పరీక్ష  కేంద్రాలలో ఫర్నిచర్,ఎలక్ట్రిసిటీ, తాగునీరు ,సీసీ కెమెరాలు మొదలగు అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. పరీక్షలు ఈనెల 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి 12:30 వరకు నిర్వహించబడునని  విద్యార్థిని విద్యార్థులు మొదటి రోజు పరీక్షా సమయానికంటే ఒక గంట ముందుగా హాజరు కావాలని సూచించారు. జడ్.పి.హెచ్.ఎస్ చివ్వెంల కేంద్రంలో 198 మంది విద్యార్థులు, జడ్పిహెచ్ఎస్ తిరుమలగిరి కేంద్రంలో 114 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని , ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు ఎవరు కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనగా సెల్ ఫోన్స్, డిజిటల్ వాచెస్ మొదలగునవి ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షా కేంద్రంలోకి తీసుకొని రాకూడదని తెలిపారు  . ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు పరీక్షా సమయం కంటే ముందే హాజరై పరీక్షలు విజయవంతంగా నిర్వహించుటకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.