విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

– దేశి రామ్ నాయక్ ఏటీడీవో
నవతెలంగాణ – గోవిందరావుపేట
ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ములుగు ఏటీడీవో దేశి రామ్ నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని కర్ల పెళ్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఏటిడిఓ దేశి రామ్ నాయక్ ఆకస్మికంగా సందర్శించారు.మొదటగా పాఠశాల ప్రదానోపాధ్యాయులు కల్తీ.శ్రీనివాస్ తో 10వ,తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి మంచి రిజల్ట్ తీసుకురావాలని సూచించారు.విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని,కాచి చల్లార్చిన నీరు తాగాలని తెలిపారు విద్యార్థుల మధ్యాహ్న భోజనం ను పరిశీలించారు స్టోర్ రూమ్,పాఠశాల అన్ని రికార్డులను పరిశీలించారు ఉపాద్యాయులు విద్యార్థుల సంఖ్యను పెంచి వారి మంచి విద్యార్థులుగా తీర్చిద్దేందుకు కృషిచేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.