– ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలని జిల్లా సైన్స్ అధికారి రఘురమణ అన్నారు. బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ రెండులో జిల్లా స్థాయి జాతీయ సైన్స్, సదరన్ ఇండియా సైన్స్ డ్రామా పోటీలను నిర్వహించారు. ఇందులో ఆయా పాఠశాలల విద్యార్థులు సైన్స్ తో కూడిన డ్రామాలు చేస్తు అలరించారు. పర్యావరణం, ప్రజలకు ఉపయోగపడే విషయాలను వివరిస్తు పోటీల్లో పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలు వారి ప్రతిభ అధారంగా విద్యార్థులను ఎంపిక చేశారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను అందించి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. కాగా రాష్ట్ర స్థాయిలో పోటీలు ఈనెల 18న హైదరాబాద్ లో జరుగనున్నాయి. ఇక్కడ ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి రఘురమణ మాట్లాడుతూ… విద్యార్థుల్లో సైన్స్, ప్రయోగాలపై అవగాహన పెంచేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా స్థాయి జాతీయ సైన్స్, సదరన్ ఇండియా సైన్స్ డ్రామా పోటీలకు స్పందన వచ్చిందన్నారు. సైన్స్ సెమినార్ 16 మంది విద్యార్థులు, డ్రామాలో ఏడు పాఠశాలలు ఆరు థిమ్స్ పాల్గొన్నాయన్నారు. ఇందులో సెమినర్ కు జోసెఫ్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థి, డ్రామాలో జడ్పీఎస్ఎస్ లక్ష్మీపూర్ రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. వీరు హైదరాబాద్ లో జరిగే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి జాతీయ స్థాయిలో ఆదిలాబాద్ రాణిస్తుందని ఇసారి కూడా అదే జరుగుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సైన్స్ ఆఫీసర్ అరె భాస్కర్, పాఠశాల హెచ్ఎం ఎం. సుధాకర్, లక్ష్మీపూర్ హెచ్ఎం పోరెడ్డి అశోక్, జైనథ్ హెచ్ఎం మద్ది లస్మన్న, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్ రెడ్డి, మ్యూజిషియన్ మేస్రం రాజు, మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.